మేడారంలో గద్దెల ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి

– సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి
– ఎండలకు ఇబ్బంది పడుతున్న భక్తులు
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల గద్దల ప్రాంగణంలో ఎండాకాలం ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా చల్లని త్రాగునీరు మరియు, గద్దెల వద్ద కింద కాళ్లు కాలకుండా మ్యాట్ లు ఏర్పాటు చేయాలని సమ్మక్క పూజారి సిద్ధమైన స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం పగిడిద్దరాజు పూజారి అర్రెం లచ్చు పటేల్ తో కలిసి గద్దెల ప్రాంగణానికి సందర్శించి పరిశీలించారు. ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తులు కింద కాలు కాలుతుంటే పరుగెడుతుంటే చూసి విచారం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ అధికారులు ఇప్పటికైనా మేడారం గద్దెల ప్రాంగణం మొత్తం భక్తులు కాల కాలకుండా మ్యాట్ లు, చల్లటి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఈఓ గారిని కోరారు.