శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కిక్కిరిసిన భక్తులు

Devotees thronged Sri Kalabhairava Swamy Templeనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇస్సన్న పల్లి (రామారెడ్డి )లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం భక్తులు కిక్కిరిశాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కలు తీర్చుకున్నారు. స్వామివారికి సింధూర పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు రామచంద్రం, సిబ్బంది సురేందర్, నాగరాజు, పూజారులు శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.