
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం నాడు ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆలయ సందర్శనలో పోటెత్తారు మూడు రాష్ట్రాల నుండి భక్తులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కొందరు సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించి అన్నదానాలు చేపట్టారు. నూతనంగా పెళ్లిళ్లు జరిగిన వధూవరుల జంటలు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు శనివారం నాడు భక్తులతో ఆంజనేయస్వామి ఆలయం పోటెత్తి కిటకిట లాడింది.