
పెద్ద కోడపగల్ మండలంలోని వడ్లం నుండి వార్కరి భక్తులు పాదయాత్ర గా బయలుదేరారు. గ్రామంలో రాత్రి ఏకాదశి సందర్భంగా రాత్రంతా మరాఠీ, తెలుగు, శివ భక్తి భజన పాటలతో జాగరణ చేసి తెల్లవారుజామున ద్వాదశిని పురస్కరించుకుని మగవారి దర్శనం కొరకై వడ్లం గ్రామం నుండి భక్తులు పాదయాత్రకు బయలుదేరారు. ప్రతి సంవత్సరం ఇక్కడి నుండి మహారాష్ట్ర లోని పండరిపూర్ కు దర్శనం కోసం భక్తులు పాదయాత్ర తో నడుచుకుంటూ వెళ్లి విట్ఠల రుక్మిణి దేవుడిలకు మొక్కి దర్శనం చేసుకుంటామని భక్తులు తెలిపారు. పాదయాత్రగా వెళ్లిన భక్తులకు గ్రామ ప్రజలు శ్రీ రాములోని వారి పాదం వరకు వెళ్లి విడుకోలు పలికారు. ఈ పాదయాత్రలో భజన వార్కర్ రాజప్ప పటేల్, ఎర్రోళ్ల బాబు మహారాజ్, పెద్దకాపు గంగారం,తదితరులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో శామప్ప పటేల్, రాజేందర్ మాలి పటేల్, భీమప్ప,విశ్రాంతి ఉద్యోగి బుజప్ప వార్ చంద్రప్ప , సైరామ్ మహారాజ్, హనుమాన్డ్లు మహారాజ్ , పాల్గోన్నారు.