కవి సీతారాంకు దేవులపల్లి రామానుజరావు పురస్కారం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఆర్‌ సీతారాంకు దేవులపల్లి రామానుజరావు పురస్కారం లభించింది. తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. డాక్టర్‌ సీతారాం ‘ఇదిగో ఇక్కడిదాకే,’ సన్నాఫ్‌ మాణిక్యం’, ‘కుప్పం కవితలు’ వంటి కవితా సంపుటాలు, ‘అదే పుట’ మొదలైన విమర్శనాత్మక వ్యాస సంపుటాలు, పరిశోధన గ్రంథాలను వెలువరించారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం ఎస్సార్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి గతంలో కాళోజీ పురస్కారం అందుకున్నారు. ఈనెల 24న దేవులపల్లి రామానుజరావు 107వ జయంతి సందర్భంగా పరిషత్‌ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే సభలో హైకోర్టు న్యాయమూర్తి జస్ట్‌ కె లక్ష్మణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ అవార్డును అందచేస్తారు. అవార్డు గ్రహీతకు రూ.25 వేలు నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందచేసి, శాలువాతో సత్కరిస్తారని పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జే చెన్నయ్య మంగళవారంనాడొక ప్రకటనలో తెలిపారు.