ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన డీజీ అనిల్‌ కుమార్‌

DG Anil Kumar visited the government hospitalనవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని గురువారం తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్ పి ఎఫ్ హైదరాబాద్(డీజీ) అనిల్‌ కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ..  ఆసుపత్రిలో సిబ్బంది పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డీజీ ని కోరడం జరిగింది.