డా.పుట్ల అనిల్ కుమార్ ను అభినందించిన డీజీపీ..

DGP congratulated Dr. Putla Anil Kumar.– జంతు శాస్త్రంలో డాక్టరేట్ సాధించడం అభినందనీయం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ట్రాన్స్ కో విజిలెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ ఇటీవలే జంతు శాస్త్రంలో డాక్టరేట్ ను రాజస్థాన్ లోని మాధవ్ యూనివర్సిటీలో పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కానిస్టేబుల్ గా ఉండి దేశంలోనే అత్యున్నత విద్య అయిన పిహెచ్డిని పూర్తి చేసుకోవడం అభినందనీయమని, ఉద్యోగిగా ఒకవైపు విధులను సక్రమంగా నిర్వహిస్తూనే అత్యున్నత విద్యను పొంది పోలీసు శాఖలో ఆదర్శంగా నిలిచిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ ను డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఐ.వి.ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ. డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుందని, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనిల్ కు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.