బాలయ్యతో ఢీ అంటే ఢీ…

నందమూరి బాలకష్ణ, అనిల్‌ రావిపూడి వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎన్‌బికే108లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించనున్నట్టు తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించ నుంది. ఇందులోని ఓ పవర్‌ ఫుల్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ని ఎంపిక చేశారు. అనౌన్స్‌మెంట్‌ వీడియోలో బాలకష్ణ ‘లెజెండ్‌’ చిత్రంలోని ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు ‘అనే పాపులర్‌ డైలాగ్‌ను అర్జున్‌ రాంపాల్‌ చెప్పారు. అలాగే దర్శకుడు అనిల్‌రావిపూడితో ఆయన చేసిన సంభాషణ కూడా ఉంది. ఈ సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు.విజయదశమి (దసరా)కి ఈ సినిమా థియేట్రికల్‌ విడుదలకు సిద్ధమవుతోంది.