ధన్‌.. ధనా.. ధన్‌

Dhan.. Dhana.. Dhanతుపాకి, రివాల్వర్‌, పిస్తోలు ఏదైతేనేం ఏముంటుంది ధన్‌ధనధన్‌, ఢాంఢాం, టిష్షుం టిష్షుం అనేనా? చచ్చేవాడు చచ్చుతాడు కనుక ఈ సంగతి చెప్పలేడు. చంపేవాడు కసెక్కి ఉంటాడు కనక చెప్పకపోగా మరోసారి ట్రిగ్గర్‌ నొక్కేయగలడు.
అసలు ఇప్పుడు లోకంలో చచ్చువార సంఖ్యా, చంపేవార సంఖ్యా పెరిగిపోతున్నది. దేశాల మధ్యయితేనేం, మనుషుల మధ్యయితేనేం? మనుషుల మధ్య సంబంధాలు మరీ పిగిలిపోయి, చిట్లిపోయి, చెదిరిపోయ చావు కబుర్లవుతున్నవ. బుద్ధుడు జ్ఞానం చెట్టు కింద సేదదీరితేనేం, అశోకుడు బుద్ధి మతం వ్యాప్తచేస్తేనేం మనుషుల లోపల కోపం చిరాకు, అసహనం అశాంతి బుద్ధిగ ఉండనీయడం లేదు ఎవరినీ.
ధన్‌ మని పిస్తోలు పేలిన చప్పుడు విని మెలకువ వచ్చింది విశ్వప్రసాద్‌కి. ఎవడ్రా అదీ అని లేచాడు పక్క మీది నుంచి. నేనే డాడీ నిన్న మీరు కొనిచ్చిన పిస్తోలు భలే పేలింది అన్నాడు కొడుకు మంచం పక్కనే నిలబడి. పొద్దున్నే వాడేశావా బుల్లెట్‌. ఎవర్ని షూట్‌ చేశావురా? ఇంకెవడ్ని డాడీ తమ్ముడ్నే టీవీలో ‘డోరా’ చూద్దామంటే రిమోట్‌ ఇవ్వలేదు. సరే పిస్టల్‌ పనితనం తెలుస్తుంది కదా అన షూట్‌ చేసేశానన్నాడు పెద్దాడు.
ఇంటి ముందు కూరగాయల వాడతో బేరం ఆడుతున్నది ఇంటావిడనగా ఇల్లాలు. కిలో ఐదు వేలకు తగ్గదన్నాడు వాడు. కొంటే కొను లేకుంటే లేదు అని మొండికేశాడు. సరే అని ఇల్లాలు అన్నాక త్రాసులో ఉల్లి గడ్డల్ని తూచాడు. సరిగ్గా ఉందా తూకం ఒకట వెయ్యి ఇంకా అందామె. వాడు వెయ్యనంటే వెయ్యను అన్నాడు. ఇల్లాలికి పిచ్చి కోపం వచ్చింది. తుపాకీ టిష్యూరు అంది.
ఆఫీసుకు తొందరగా వెళ్ళకపోతే బాస్‌ షూట్‌ చేస్తాడు బాక్స్‌ రడీ చెయ్యి అన్నాడు విశ్వప్రసాద్‌. ఏంటి, చేసేది? పని మనిషి రానేలేదు. బోళ్ళు అనగా ఎంగిలి గిన్నెలూ వగైరాలు ఎవరు తోముతారు. అది రానీ షూట్‌ చేసి పారేస్తాను అంది భార్య ముక్కు ఎగరేస్తూ. దాన్ని షూట్‌ చేస్తే తననే ఆ పని చెయ్యమంటుందని భయపడ్డ ప్రసాద్‌ పోనీవే వచ్చేస్తుందిలే. ఈ సారికి ఆఫీసు క్యాంటీన్‌లో తినేస్తా నంటూ బయలుదేరాడు ఆఫీసుకి.
సరే కానీ! ఆఫీసు నుంచి వస్తూ వస్తూ ఓ మంచి రివాల్వర్‌ కొనుక్కు రండి అందామె. అదేమిటోరు నిన్నే కదా కొత్తది తెచ్చా, దాంతో కూరగాయలమ్మే వాడ్ని షూట్‌ చేసి పారేశావు.. మళ్ళీ తేవాలా? అన్నాడు విశ్వప్రసాదూ, మొగుడూ అయిన మగాడు. తెలీనట్టు మాట్లాడకండి. ఒకసారి కట్టిన ‘సారీ’ మళ్ళీ కట్టానా ఎప్పుడయినా. ఒకసారి వాడిన తుపాకీ మళ్ళీ మళ్ళీ వాడతానా? అందామె కోపంగా. కోపంలో వాడిన తుపాకీ అని మర్చిపోయి షూట్‌ చేసినా చెయ్యగలదు అనుకుని. సరేలే తెస్తా చస్తానా అలమర నిండా చీరలూ, తుపాకీలు నిండిపోయినవి. ఓ అలమరా కూడా ఆర్డరిస్తానంటూ ఆఫీసుకు బయలుదేరాడు విశ్వప్రసాద్‌.
ఎప్పటిలాగే లేటయింది. ఆఫీసులో ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. తన సీట్లో కూచోబోతుంటే అటెండర్‌ రానే వచ్చాడు సార్‌! సార్‌ పిలుస్తున్నాడు సార్‌ అంటూ. చచ్చినట్టే, చచ్చాంపో అనుకుంటూ లేచిన విశ్వప్రసాద్‌లో అటెండర్‌ ఇంతకుముందే లేట్‌గా వచ్చిన ఇద్దరిని షూట్‌ చేశారు సార్‌, సార్‌ గారు అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఇవాళేనా, నా ‘డెత్‌ డేట్‌’ అని భయపడుతూ బాస్‌ గదిలోకి వెళ్ళాడు. ఆయన ఎన్నడూ లేంది ముఖంలో ముడతలు సాపుగా బెట్టి, ఎత్తుపళ్ళు నోటి బయటపెట్టి రావోరురా. ఇందాకే ఇద్దరిని షూట్‌ చేశాను పేలడానికి కొంచెం టైం తీసుకుంది. నీకెవరో మంచి పిస్తోళ్ళు అమ్మేవాడు తెలుసంటగదా నాకో అరడజను పిస్తోళ్ళూ అందులోకి కావల్సినన్ని బుల్లెట్లూ తెచ్చి పెడతావా? అన్నాడు. బతుకు విశ్వప్రసాదుడా అనుకున్న విశ్వప్రసాద్‌ ముఖం చాటంత వెడల్పు చేసి తప్పకుండా తెస్తాను సార్‌’ అంటూ పులి బోనులోంచి బయటకు వచ్చేశాడు.
ఆఫీసు నుంచి బయటపడగానే బస్‌స్టాప్‌కు పరుగెత్తి పరుగెత్తే బస్సు ఎక్కాడు విశ్వప్రసాద్‌. బస్సు పదడుగులు తిరిగిందో లేదో ‘ధన్‌’ మంది పిస్తోలు. డ్రైవర్‌ని షూట్‌ చేశాడు కండక్టర్‌ అభిప్రాయ భేదం వచ్చిందట. ఆగిపోయిన బస్సులోంచి దిగినడుస్తుంటే ఓ చోట స్వామీజీ ప్రవచనాలు వినిపించాయి. విందామని ఆగాడు విశ్వప్రసాద్‌. మానవ సంబంధాలు పూర్తిగా సర్వనాశనమయిపోయినవి. మనుషుల కోపం ముక్కుమీదికి ఎక్కీ ఎక్కంగానే తుపాకులు పేలుతున్నాయి. ఇది మంచిది కాదు మన సంస్కృతికాదు అని ఆయన అంటూ ఉంటే, చెప్పావులే ప్రవచనం అని ఒకడు అరిచాడు ఓ పక్క నుంచి. తుపాకీ ఢామ్మని పేలింది మరో పక్క నుంచి. స్వామీజీకి ‘హేరామ్‌!’ అనే అవకాశం కూడా దక్కలేదు.
నాన్నాలేవండి అని కొడుకు అరిచి గీ పెట్టడంలో మెలకువ వచ్చింది. విశ్వప్రసాద్‌కి. వాడి చేతుల్లో తుపాకీ ఉందేమోనని చూశాడు లేదు. ఇదంతా కలే కదా అనుకున్నాడు. ప్రతివాడి చేతిలోనూ పిస్తోలు ఉండి, అవి క్షణానికోసారి పేలుతూ ఉండే హిందీ వెబ్‌ సీరిస్‌ చూశాడు కదా రాత్రి అందుకున్న మట ఈ ధన్‌ ధనా ధన్‌, ఢాం ఢాం, టిష్షూం టిష్షూం, అయినా కలలో స్వామిజీ అన్నట్టు మానవ సంబంధాలు పూర్తిగా సర్వనాశనమయిపోయినవి. నిజంగా ఇప్పుడు లోకంలో చచ్చువారి సంఖ్యా, చంపేవారి నంబరూ పెరిగి పెట్రేగుతున్నది అనుకుంటూ మంచం దిగాడు.
చింతపట్ల సుదర్శన్‌ 9299809212