– శ్రీలంక-ఇంగ్లండ్ తొలి టెస్ట్
మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు తొలి టెస్ట్‌లో గొప్పగా పుంజుకుంది. 113పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా లంక జట్టు తొలిరోజు టీ విరామ సమయానికి 7వికెట్ల నష్టానికి 216పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. దీంతో తొలి మూడు వికెట్లను 6పరుగుల్లోపే కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ ధనుంజయ(74), లోయర్ ఆర్డర్ బ్యాటర్ ప్రియనాథ్(66నాటౌట్) రాణించడంతో 68ఓవర్లలో 8వికెట్ల నష్టానిఇక 216పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజ్‌లో ప్రియనాథ్తోపాటు ఫెర్నాండో(3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లు బోక్స్కు మూడు, అట్కిన్సన్, బషీర్‌కు రెండేసి, మార్క్ వుడ్‌కు ఒక వికెట్ దక్కాయి. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.