ధన్వాడ ప్రధాన రోడ్డుపై దిగబడ్డ

ధన్వాడ ప్రధాన రోడ్డుపై దిగబడ్డ– సీపీఐ(ఎం) బస్సు యాత్ర…బస్సు
– బస్సులో రాష్ట్ర కమిటీ నాయకుల బృందం
– వేరే వాహనంలో నాయకుల జిల్లా కేంద్రానికి తరలింపు
నవతెలంగాణ మల్హర్ రావు/ కాటారం
సింగరేణి ప్రయివేటికరణకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాటంలో భాగంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మంచిర్యాల,బెల్లంపల్లిలో యాత్ర ముగించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి కాటారం మండలంలోని ధన్వాడ గ్రామం వద్ద ప్రధాన రహదారిపై బస్సు దిగబడింది. ఆగస్టు 2న శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బస్సుయాత్రను ప్రారంబించాల్సి ఉంది.దిగబడ్డ బస్సులో రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సభ్యుడు ఎస్ వీరయ్య తోపాటు ముఖ్య నాయకులు,కళాకారుల బృందం ఉన్నారు.బస్సు బురదలో ఇరక్కపోవడంతో భూపాలపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి బంధు సాయిలు మరొక్క వాహనం ఏర్పాటు చేసి సిపిఎం బృందాన్ని జిల్లా కేంద్రానికి సురక్షితంగా పంపినట్లుగా తెలిపారు.అయితే మంథని నుంచి కాటారం వరకు పోర్ వే రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.పనులు జరుగుతున్న క్రమంలో రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్డు పనులు నిలిసిపోయి రోడ్డుపై భారీగా గోతులు,బురద కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ క్రమంలోనే సిపిఎం బస్సుయాత్ర బురదలో ఇరిక్కపోయింది.దీంతో సిపిఎం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.