– ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్
– అర్ధరాత్రి వరకు బేరాసారాలు
– అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డిపై కొంత కాలంగా అవినీతి ఆరోపణలు
– జిల్లాలో వివిధ శాఖల నుంచి నెలవారి వసూళ్లు
– ఆరోపణలు, ఫిర్యాదులపై ఉన్నతాధికారి నిర్లక్ష్యం
– 14 గుంటల భూమి క్లియరెన్స్‌కు రూ.8లక్షలు డిమాండ్
– ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు
– ఇద్దరు అరెస్టు, అనంతరం వారి నివాసాల్లో సోదాలు
రంగారెడ్డి కలెక్టరేట్‌లో ధరణి దందా అనేదానికి జిల్లాలో ఉన్నత స్థాయి అధికారిపై ఏసీబీ దాడులతో తేటతెల్లమవుతోంది. గతంలో పలువురు కలెక్టర్లపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు కలెక్టర్లను సైతం ప్రభుత్వం మందలించి వారిపై చర్యలకు పూనుకుంది. కలెక్టరేట్ అధికారులపై కొంత కాలంగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. నాలుగు నెలల నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారుల వ్యవహరశైలి, పనివిధానంపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫైరవీకారులకు కేరాఫ్ అడ్రాస్‌గా కలెక్టర్ కార్యాలయం మారిపోయింది. గత ప్రభుత్వంలో జోరుగా అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగించారు. అదే దోరణితో ఈ ప్రభుత్వంలో కూడా అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు పనికో రేటు పెట్టుకొని ఫైళ్లు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కార్యాలయంలో ఇంతా తతంగం జరుగుతుంటే జిల్లా కలెక్టర్ ఎందుకు నిర్లక్ష్యంగా ఉండడం వెనక మర్మమేంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఏసీబీకి పట్టుబడిన అదనపు కలెక్టర్‌భూపాల్‌రెడ్డి
బాధితుడు జక్కడి ముత్యంరెడ్డికి సంబంధించిన 14 గుంటల భూమి నిషేదిత జాబితాల్లో ఉంది. ఆ భూమిని నిషేదిత జాబితా నుంచి తొలగిం చాలని సంబంధిత అధికారులతో చర్చించారు. దీంతో ఆ అధికారి రూ.8లక్షలు డిమాండ్ చేయడంతో కంగుతిన్న బాధితుడు ముత్యంరెడ్డి ఏసీబీని ఆశ్రయిం చారు. దాంతో ఏబీసీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ మధన్‌మోహాన్‌రెడ్డిని ట్రాప్ చేసి పట్టుకున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకే డబ్బులు తీసు కున్నట్టు మధన్‌మోహన్‌రెడ్డి ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. దాం తో మధన్‌మోహన్‌రెడ్డి సహకారంతో ఏసీబీ అధికారులు అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డిని పట్టుకున్నారు. అనంతరం వీరి ఇద్దరిని రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్ కార్యాలయానికి తీసుకెళ్లి జేసీ చాంబర్‌లోనే రాత్రాంత ఉంచినట్టు సమా చారం. ఆ రాత్రి ఏసీబీ అధికారులు ఏ ఫైల్ క్లియరెన్స్ కోసం నగదు డిమాండ్ చేశారో ఆ ఫైల్ను క్షుణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. మంగళవారం ఉదయం తెల్లవారుజామున నాగోల్ బండ్లగూడలోని హిందూ హారణ్య విల్లాలో అదనపు రెవెన్యూ కలెక్టర్ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ భూపాల్‌రడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధన్‌మోహన్‌రెడ్డిలను కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించారు.
భారీ మొత్తంలో డాక్యుమెంట్లు స్వాధీనం…
అదనపు రెవెన్యూ కలెక్టర్ భూపాల్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే భారీ మొత్తంలో డాక్యుమెంట్స్ దోరికినట్టు సమాచారం. అంతేకాకుండా రూ.16లక్షల నగదుతో పాటు ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్థిరాస్థులను, నగదును ఏసీబీ కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ పత్రాల ఆధారంగా ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టినట్టు ఏసీబీ అధికారులు అనాధికారికంగా అంచనాలు వేస్తున్నారు. వెయ్యిల కోట్ల ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు.
గ్రూపు-2 నుంచి అదనపు కలెక్టర్ వరకు..
ఏసీబీకి పట్టుబడిన భూపాల్‌రెడ్డి గ్రూపు-2తో ఉద్యోగంలోకి వచ్చారు. మొదటి పోస్టింగ్ మహాబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటి తహసీల్ధార్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత పదోన్నత్తిపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ విభాగంలో సూపరింటెండెంట్‌గా, తహసీల్దార్‌గా మరో పదోన్నత్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వంలో అప్పటి మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి ఓఎస్‌డీగా పనిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా విధుల్లో కొనసాగుతు న్నారు. అదేవిధంగా మధుసూధన్‌రెడ్డి ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో వీఆర్వోగా పనిచేసి కొత్త జిల్లాల పునర్వీభజనలో రంగారెడ్డిలోని రెవెన్యూ విభా గంలో ఈ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.