ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి: డైరెక్టర్ మకరంద్

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ధరణి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ సోమవారం అన్నారు. మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్ మకరంద్ సోమవారం ధరణి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీవో రాజ గౌడ్, తాసిల్దార్ కిరణ్ మై తో ధరణి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పరిష్కరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా గిఫ్ట్ డిడి ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా చూశారు. ఫీల్డ్ లేవల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గజాల భూమిని, రెండు నుంచి మూడు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయరాదని, నాలా కాన్వర్షన్ చేయించుకున్న తర్వాతనే చేయాలన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ధరణిలో చేసినటువంటి కొన్ని పనులను చూసి సంతృప్తి చెందారు. కొన్ని పనులను కొన్ని సమస్య వలన చేయరాదని తెలియజేశారు. గతంలో ధరణి రాకముందు ఒక వ్యక్తి వేరే వ్యక్తికి తన భూమిని అమ్ముకున్నప్పుడు అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కానీ పహానిలో గాని ఆన్లైన్  గాని ఎంటర్ చేయించుకోనందున, అదే వ్యక్తి అదే భూమిని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ధరణిలో గాని ఆన్లైన్లో గాని ఎవరికి ఎంట్రీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ తాసిల్దార్ కిరణ్ మై, డిప్యూటీ తాసిల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, రెవెన్యూ సిబ్బంది, ధరణి కంప్యూటర్ ఆపరేటర్ తదితరులు ఉన్నారు