ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు రెవెన్యూ కలెక్టర్ బెన్ షాలోమ్ తెలిపారు. గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో అమరేందర్ లు ధరణి పెండింగ్ దరఖాస్తులు, అర్జీల పరిష్కారం, సవరణ పై మండల తాసిల్దార్ దేశ్యా నాయక్, రెవెన్యూ అధికారులతో,సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పెండింగ్ దరఖాస్తులను రోజు వారి లక్ష్యం ఏర్పరచుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్వీకరించిన దరఖాస్తులను ఆ వారంలోనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తిరస్కరించిన దరఖాస్తుల విషయమై కారణాలు అర్జీదారునికి తెలపాలన్నారు. ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. మండలంలో 153 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిలో 70 డేటా కలెక్షన్ 20 పిఓపి లో ఉన్నాయని వాటిపై రైతులకు నోటీసు అందజేసి సెక్షన్ 34 ద్వారా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ ని పరిష్కరించాలని సూచించారు. భూమి రిజిస్ట్రేషన్ చేసిన రైతుల పేరే భూమి చూపించడంతో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు .మండలంలో పరిష్కరించని దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపినట్లయితే అక్కడ పరిష్కరించుటకు వీలవుతుందన్నారు. జిల్లాలో రైతుల నుండి 8000 దరఖాస్తులు వచ్చాయని వాటిలో నాలుగువేల దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. జిల్లాలోని మీసేవ నిర్వహించే నిర్వాకులచే త్వరలో సమావేశం నిర్వహించి ధరణిపై విధివిధానాలను తెలియపరుస్తామన్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి కుల ధ్రువీకరణ పత్రాలను, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను, రికార్డులను పరిశీలించమన్నారు. మండలంలో కొన్ని విలేజ్లలో విస్తీర్ణమి మించి ల్యాండ్ ఉన్నదని వాటిపై రైతులకు నోటీసులను అందజేసి రికార్డు పరంగా సరి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ధరణి ఎంతో ఉపయోగపడుతుందని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఆర్ఐ జాంగిర్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ,పాల్గొన్నారు.