
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టభద్రుల ఎన్నికల్లో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారని మళ్లీ ఈ ఉప ఎన్నికలో కూడా సమర్థవంతంగా పనిచేసే రాకేష్‌రెడ్డి కి మొదటి ప్రాధాన్య ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ ధారావత్ గాంధీ నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుల తో కలిసి కరపత్రాలు, డోర్ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి అని, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే పట్టం కట్టాలన్నారు. ఈ గెలుపుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని, అందుకే ఈ ఎన్నికల ను సవాళ్లుగా స్వీకరించాలన్నారు. ప్రతీ పట్టభద్రుని కలిసి ఓటు అభ్యర్థించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, మండల ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, మాజీ సర్పంచ్ చింతల భాస్కర్, మండల నాయకులు శ్రీరాం సుధీర్, దుంపల సమ్మయ్య, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీను, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్రసాని రామ్మూర్తి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మైలపాక అనిల్, యూత్ ప్రధాన కార్యదర్శి కూతురు అనుదీప్, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు దేశెట్టి వెంకటేష్, మహంకాళి దయాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలుక బిక్షపతి, శంకర్, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.