లాప్ టాప్ ని అందించిన ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

– లక్ష రూపాయల విలువగల లాప్టాప్ ను అందించిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

నవతెలంగాణ-జూలపల్లి /ధర్మారం
ధర్మారం మండలంపైడి చింతలపల్లి గ్రామానికి చెందిన మహేష్ పుట్టుకతో కంటి చూపు సరిగా లేకపోయినప్పటికీ పట్టుదలతో ఉన్నత చదువులు కొనసాగిస్తుండగా తనపై చదువుకు అవసరమైన ల్యాప్ ట్యాప్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకి లక్ష రూపాయల విలువ గల ల్యాప్ ట్యాప్ ను మంజూరు చేశారు. మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా ధర్మారం మండల కేంద్రంలోనీ పార్టీ కార్యాలయంలో ల్యాప్ ట్యాప్ నీ మహేష్ కి అందజేశారు. ఈ  సందర్భంగా మహేష్ ఎమ్మెల్యే కి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కంటి చూపు సరిగా లేకపోయినా పట్టుదలతో ఉన్నతమైన చదువులు చదువుతూ తన పై చదువుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు అయినా ల్యాప్ ట్యాప్ నీ మహేష్ కి అందజేయడం చాలా సంతోషంగా ఉంది. మహేష్ కి భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న మండల కాంగ్రెస్ పార్టీ పక్షన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని, నియోజక వర్గంలో పెద విద్యార్థులకు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తననీ కలవవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్య బోధన విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ప్రతి పెద విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సంధర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.