మాజీ మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ అకాల మరణం ఎంతో బాధాకరమని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మౌనం పాటించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు చేసిన కృషి, నగర అభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో ప్రజలకు ఎంతో సేవ చేశారని, నగర అభివృద్దికి దోహదపడ్డారని అయన గుర్తుగా నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన అభ్యర్థన మేరకు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన తిర్మనాన్ని సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిజామాబాద్ శాసన సభ్యులు ధనపాల్ సూర్యనారాయణ, మున్సిపాల్ కమీషనర్ మంద మకరంద్, కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.