నవతెలంగాణ-డిచ్ పల్లి : ఆర్మూర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలో జిల్లా స్థాయి సీనియర్ మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఇందులో డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు సన్నిధి బృంద రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపల్ సంగీత ఆదివారం తెలిపారు.ఎంపిక కావడం పాట్ల ప్రిన్సిపాల్ సంగీత, అద్యపకులందరు విద్యార్థులను అభినందించారు. ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ఈనెల 23 నుండి 25 వరకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ గ్రౌండ్ బాలానగర్ సికింద్రాబాద్ జిల్లాలో జరిగే 69వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల పురుషుల బాల్ బ్యాడ్మింటన్ క్రీడ పోటీలలో పాల్గొంటారని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పి నీరజా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిఈటి జోష్ణ, హౌస్ టీచర్స్ వైస్ ప్రిన్సిపల్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.