రాష్ట్ర బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మారం(బి) విద్యార్థినిలు ఎంపిక


నవతెలంగాణ డిచ్ పల్లి: ఈనెల 16 నుండి 18 వరకు జరుగుతున్న 67వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ బేస్ బాల్ అండర్-17 పోటీలకు డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు నక్షత్ర, శరణ్య నూ పాఠశాల ప్రిన్సిపల్ సంగీత ఆదివారం అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ క్రిడ పోటీల్లో తమ సత్తా చాటాలని పేర్కొన్నారు. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నీరాజా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని విద్యార్థులకూ సూచించారు.ఈకార్యక్రమంలో పిఈటీ జోష్న, హౌస్ టీచర్స్ విద్యార్థులను అభినందించారు.