ధర్మసాగర్ డీహెచ్ పీఎస్ మండల కమిటీ ఎన్నిక

Dharmasagar DHPS mandal committee electionనవతెలంగాణ – ధర్మసాగర్
ధర్మసాగర్ మండల  దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్ పీఎస్)మండల కమిటీని  (డీహెచ్ పీఎస్)దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నిమ్మల మనోహర్ కార్యదర్శి రొంటల దేవా ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల పై జరుగుతున్న దాడులపై దళిత కుల పోరాట సమితి అనేక పోరాటాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు ఆర్థిక వెనుకబాటుతనానికి ఈ పాలకులు గురి చేస్తున్నారని అన్నారు. హక్కుల కోసం నిరంతరం దళిత హక్కుల పోరాట సమితి పోరాడుతుందని, దళితులు తమ హక్కులకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా  రాజారపురత్నం, అధ్యక్షులుగా కొలిపాక హరీష్, ఉపాధ్యక్షులు బైరపాక రవి, సహాయ కార్యదర్శి ఆకారపు అరుణ్,రాజారపు దేవయ్య,కోశాధికారిగా కనకం హరీష్,కార్యవర్గ సభ్యులుగా కిమ్మె సారపు శీను,మేడి నిఖిల్, గుండేటి సందీప్,పసునూరి అనిల్,కొలిపాక అనిల్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.