
మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.12,000 వేల రూపాయలను గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన ఊదరి ఎల్లమ్మ నిన్న సాయంత్రం అకాల మరణం చెందారు. మృతురాలి దహన సంస్కారాల కొరకు ధర్మోజిగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాచకొండ భార్గవ్,ఊదరి శ్రీనివాస్,దాసరి గణేష్,డాకోజీ సతీష్,వంగూరి సురేష్,ఊదరి రవి,దాసరి లింగయ్య,ఐతరాజు శ్రీకాంత్,జంగం సందీప్, సందీప్,ఊదరి మురళి,బద్రి ఉపేందర్,దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.