
ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో అయిజ తహసిల్దార్ కార్యాలయం ముందు ఈ రోజు సీఐటీయూ ఆధ్వర్యంలో ఇండ్లు ఇళ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ ల సాధన కోసం ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటస్వామి మాట్లాడుతూ…ఇండ్లు ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ కోసం పేదలు పెట్టుకున్న దరఖాస్తులతో పాటు వినతి పత్రాన్ని డిప్యూటీ తాసిల్దార్ కు అందజేస్తూ పేదలకు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అయిజ మండల అధ్యక్షులు బి.ఈశ్వర్ వివిధ సంఘాల నాయకులు రాము పల్లెన్న భీమ రాయుడు తిరుమలేష్ నాగరాజు మహేందర్ వీరేష్ తో పాటు ఐజ మున్సిపల్ టౌన్ లోని వివిధ వార్డుల ఇల్లు లేని పేదలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.