ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ధర్నా

– రిటైర్డ్మెంట్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు న్యాయం చేయాలి

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో గల ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట  రిటైర్మెంట్ అయ్యే టీచర్ హెల్పర్స్ ధర్నా ఆందోళన చేపట్టారు. రిటైర్మెంట్ అయ్యే టీచర్లకు ఆయాలకు డిమాండ్ పరిష్కారం కోసం పోరాడే వారికి  మద్దతుగా అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్, మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సెక్టార్ లీడర్స్ మద్దతు తెలిపినారు.