– భారత రత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్
ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిక్కుల్లో పడ్డారు!. ముంబయిలోని ఆయన నివాసం వద్ద శుక్రవారం ప్రహర్ జనశక్తి పార్టీ (పీజేపీ) కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మద్దతుగా ఓ సంస్థకు సచిన్ టెండూల్కర్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. భారత రత్న పురస్కారం అందుకున్న వ్యక్తి ఇటువంటి ప్రకటనలతో రూ. వందల కోట్లు సంపాదించాలని అనుకుంటే.. ముందు భారత రత్నను వెనక్కి ఇవ్వాలి. సచిన్ టెండూల్కర్ చర్యల వల్ల తర్వాతి తర్వం నష్టపోతుంది. సచిన్‌కు భారత రత్న ఇవ్వకుంటే.. ఆయన ఇంటి ముందు ధర్నా చేసేవాళ్లం కాదని’ పీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఓంప్రకాశ్ బాబారావ్ తెలిపారు. సచిన్ ఇంటి ముందు కూర్చుని ధర్నా చేసిన నాయకులు, కార్యకర్తలను బంద్రా పోలీసులు అరెస్టు చేశారు.