– సింగరేణి హెడ్ ఆఫీస్ (కొత్తగూడెం ) ముందు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
నవతెలంగాణ:- గోదావరిఖని: కొత్తగూడెంలో ఉన్న సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు వివిధ జిల్లాలనుంచి వచ్చిన దాదాపు 300 మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని, అన్నిరకాల అపరిమిత వైద్య సేవలు దేశ వ్యాప్తంగా అమలు పరచాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి సింగరేణి ఆసుపత్రుల్లో సీపీఆర్ ఎం ఎస్ మెడికల్ కార్డులో కోత విధించరాదని అధికారులకు, ఉద్యోగులకు ఒకే రకమైన మెడికల్ కార్డ్ ఇవ్వాలనిరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్త గ్యారంటీ స్కీములు విశ్రాంత ఉద్యోగులకు వర్తింపజేయాలని, తెల్ల రేషన్ కార్డులు,వృధ్యాప్య పెన్షన్ ఇవ్వాలని, 20 లక్షల రూపాయలగ్రాట్యుటీ సీలింగ్ 1-7-2016 నుంచి చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి సింగరేణి చైర్మన్”మేనేజింగ్ డైరక్టర్ బలరాం నాయక్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, ఉపాధ్యక్షులు కె.బీరయ్య, జాయింట్ సెక్రటరీ ఎస్.నర్సింగ్ రావ్, కొత్తగూడెం రిటైర్డ్ కార్మిక సంఘం బ్రాంచ్ నాయకులు మాతంగి లింగయ్య, ఏ.లక్ష్మీ నారాయణ, భూపాల్ పల్లి విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు జి.రాజీ రెడ్డి, ఎం.సమ్మి రెడ్డి, ఎన్.రాజయ్య,ఖమ్మం నుంచి ఎన్. వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు గజేల్లి వెంకటయ్య, ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ముఖ్య సలహాదారులు దమ్మలపాటి శేషయ్య., కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ ధర్నా ను ఉద్దేశించి ప్రసంగించారు.