మండలం లొని ఇందనపెళ్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి పశువులను మేత కోసం పశువులను అడవిలోకి తీసుకెళ్లగా అటవీ శాఖ అధికారిని పశు కాపరిపై చేయి చేసుకున్నారని,అందుకు నిరసనగా బుధవారం మండలంలోని ఇంధన పళ్లి అటవీ శాఖ కార్యాలయం ముందు గ్రామస్తులు పశువులను తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. పశు కాపరిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలని,రోజురోజుకు అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్.ఐ రాజవర్ధన్ అక్కడికి వెళ్లి వారిని సముదాయించడంతో ధర్నా విరమించారు. ఈ విషయంపై ఇందన పెళ్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ ను వివరణ కోరగా పశువులను మేపడానికి కోసం ఇందన్ పళ్లి నార్త్ అడవులలో కంపార్ట్మెంట్ నెంబర్ 238, 239, 240,234,235 లలో దాదాపు 8000 ఎకరాలు ఉన్నదని, కానీ వారు అందులోకి వెళ్ళకుండా పక్కనే ఉన్న కంపార్ట్మెంట్ నెంబర్ 178,179 లో పశువులను మేపడానికి తీసుకువెళ్లడంతో, మా సిబ్బందికి వారికి ఇక్కడికి రావద్దని తెలుపగా దీనితో సిబ్బందికి పశు కాపరికి మధ్య సంభాషణ జరిగిందని తెలిపారు.
పశువుల కాపరులకు అటవీ శాఖ అధికారులు కేటాయించిన కంపార్ట్మెంట్లలోనే తమ పశువులను మేపుకోవాలన్నారు. గ్రాస్ ప్లాంట్ లు పెంచుతున్న కంపార్ట్మెంట్లలోకి వెళ్లినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.