
అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం (AIPKS) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు,, వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి వ్యవసాయ ఉత్పత్తి సాధనాలకు విత్తనాలు పురుగుమందులు ఎరువులకు,, ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ నూతనపులిచ్చుట డిమాండ్లపై డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు. సారా. సురేష్.. ఏరియా అధ్యక్షులు. గంగారాములు మాట్లాడుతూ 2014 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరిపి రైతులకు రెండింతల ఆదాయం తెచ్చి పెడతానని తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పి మోడీ సర్కారు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్పొరేటు వ్యాపారుల దోస్తీ పెరగడంతో వ్యవసాయ రంగాన్ని బొంద పెట్టడానికి అప్పటికే ఉన్న సబ్సిడీలు అన్నిటిని రద్దు చేయడం సిగ్గుచేటని అన్నారు… వెంటనే దేశవ్యాప్తంగా రైతులను కాపాడడానికి క్షేత్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని.. 60 శాతం ఉత్పత్తి సాధనాలపై. ఎరువులు పురుగు మందులు సబ్సిడీ ఇస్తూ వ్యవసాయ రంగం కాపాడాలని కోరారు.. రైతులకు అన్ని రకాల అప్పులను రద్దు చేయడానికి మోడీకి ధైర్యం కాదు కానీ కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లు రద్దుచేసి ఆనందాన్ని పొందుతున్నాడని ఎద్దేవ చేశారు.
ఈ సందర్భంగా ఏరియా ప్రధాన కార్యదర్శి యు రాజన్న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీ రద్దుచేసి రైతులపై భారం పెంచే విధంగా వివరించిందని.. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిందని బిజెపి గుర్తు చేశారు.. మరోవైపు కేంద్రం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం దాంతో గొంతు కలిపి సర్వరోగ నివారిణి రైతుబంధుని తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత చూయించడం సబబు కాదని అన్నారు.. గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో ఏనాడు చేయలేదని వడ్డీలు మాత్రమే కొంత మాఫీ అయిందని అసలు ఆ విధంగానే మిగిలి నూతన పూలు రాక రైతులు ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారులు ఆశ్రయించి అప్పులు తీరే మార్గం లేక రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు 500 బోనస్ ను ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని అన్నారు… ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు ఇస్తారి రమేష్.. T .గంగాధర్. జిల్లా నాయకులు బి. మల్లన్న. అశోక్. లింబాద్రి.. శోభన్ తదితరులు పాల్గొన్నారు.