అలీ సాగర్, గుత్ప లిఫ్ట్ కార్మికుల ధర్నా..

Ali Sagar, Gutpa lift workers dharna..నవతెలంగాణ – నవీపేట్
అలి సాగర్, గుత్ప లిఫ్ట్ కార్మికులు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా కార్మికులకు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని తమ సమస్యను జిల్లా అధికారులకు విన్నవించిన పరిష్కారం కావట్లేదని నిరసనగా ధర్నా నిర్వహించారు. అలాగే గత ఎనిమిది నెలల నుండి కార్మికుల పిఎఫ్ డబ్బులను చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్టు నిర్వహణలో విష సర్పాలు ప్రాణుల నుండి రక్షణ లేకుండా పోయిందని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి బకాయి వేతనాలను చెల్లించాలని లేనియెడల ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తాహసిల్దార్ నారాయణ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, గణేష్, సందీప్, పవన్, రవి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.