కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: భారత రాష్ట్ర సమితి చౌటుప్పల్ మండల పట్టణ కమిటీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ తాహసిల్దార్ హరికృష్ణకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం చేయడం. ప్రజాస్వామ్యానికి గొడ్డలి గొడ్డలి పెట్టు లాంటిదని వారు విమర్శించారు. సంఘ విద్రోవ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ గతంలో హైదరాబాదులో మత కలాహలు సృష్టించి కర్ఫ్యూలు విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఆనా వైతిగా మారిందని వారు చెప్పారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని, హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్టియు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేష్ యాదవ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు కురుమ, సర్పంచులు ఏలువర్తి యాదగిరి, చౌట వేణుగోపాల్ గౌడ్ నాయకులు నవీన్ రెడ్డి, కృష్ణ, మహేష్, వెంకటేష్, శివ, సురేష్, లింగం తదితరులు పాల్గొన్నారు.