కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా

నవతెలంగాణ-కంటేశ్వర్

పే రివిజన్ కమిటీని నియమించి జూలై నుండి పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, బకాయి పడ్డ డిఏ లను వెంటనే విడుదల చేయాలని , ఈ కుబేరులో పెండింగ్ లో ఉన్న బిల్లులకు నగదు చెల్లించాలని,₹398 రూపాయలతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పెన్షనర్ల సమస్యలను
పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వైద్యం అన్ని కార్పొరేట్ , ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతించాలని, మెడికల్ బిల్లులను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా నెల రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెమోరాండాన్ని కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల నాయకులు కే. రామ్మోహన్రావు, మదన్మోహన్, ఈవిల్ నారాయణ ,సుదర్శన్ రాజ్ శిర్ప హనుమాన్లు, అందే సాయిలు, లావు వీరయ్య ముత్తారం నరసింహస్వామి, తది తరులు పాల్గొన్నారు.