– స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలి సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న స్వీపర్లకు గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్వీపర్లు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు మల్లేష్ మాట్లాడారు. ఆస్పత్రిలో స్వీపర్లు పస్తులు ఉండి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీపర్లను నియమించుకున్న ఏజెన్సీ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఏమి తిని పనులు చేయాలని మల్లేష్ ప్రశ్నించారు. జిల్లా వైద్య అధికారులు స్పందించి, స్వీపర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.