
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు ) నిజామాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ కి సమ్మె నోటీసును శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్ లు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10 11 12 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మెను నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్న భోజన కార్మికులందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలను చెల్లిస్తామని ప్రకటించిన హామీ అమలు కాలేదని, జిల్లాలో 8 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయని, కొత్త మెనూ అమలు పేరుతో హెడ్మాస్టర్లు మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు, మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పి మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతుందని ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 11 12 తేదీలలో నిర్వహించే టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సురేందర్ రెడ్డి, శేఖర్, నాగలక్ష్మి, భూలక్ష్మి, మెహమూధ, సుజాత, , స్వప్న, పర్వమ్మ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.