నవంబర్ 5న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా 

Dharna by state government pensioners on November 5నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నవంబర్ 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా ఉంటుందని తెలంగాణ ఆల్ పెన్షనర్ల అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పెన్షనర్ల అసోసియేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బకాయిపడ్డ డిఎలు విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేని నగదు రహిత వైద్యం అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో అమలు చేయాలి. కమిటెడ్ వేల్యూ ఆఫ్ పెన్షన్ ను 12 సంవత్సరాలకు కుదించాలి. పిఆర్సి రిపోర్టు తెప్పించుకొని 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న వైద్య చికిత్సకు అయిన బిల్లులు&, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ‘పెన్షనరీ బెనిఫిట్స్” వెంటనే విడుదల చేయాలి.398/- స్పెషల్ టీచర్ల నోషనల్ ఇంక్రిమెంట్ లు విడుదల చేయాలి అని డిమాండ్లతో ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ నెల 5న తలపెట్టిన ధర్నాకు అధిక సంఖ్యలో రిటైర్డు ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు షిర్ప హనుమాన్లు, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ప్రసాదరావు, నిజామాబాద్ డివిజన్ కోశాధికారి రాధా కిషన్, తదితరులు పాల్గొన్నారు.