నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
వీఆర్ఎ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని వీఆర్ఎ జేఏసీ అధ్యక్షుడు సంతోష్ కోరారు. సోమవారం వీఆర్ఎ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఓలపై ఉన్న స్టే ఎత్తివేయడం జరిగిందని జీఓను అమలు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని నినాదాలు చేశారు. జీఓ 81, 85 ప్రకారం 8797 మంది 61 సంవత్సరాలు దాడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం జీఓలు వచ్చాయని సంతోష్ తెలిపారు. అయితే దీనిపై స్టే ఉన్న కారణంగా నియామకాలు జరగలేదన్నారు. 21 నవంబర్ 2023లో హైకోర్టు స్టే ఎత్తివేసిందన్నారు. 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఎల వారుసులు విద్యార్హతలు ఉండడంతో సేవలను తహసీల్దార్ కార్యాలయాల్లో అందిస్తున్నారన్నారు. 3797 మంది 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఎ వారసులకు నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు..కార్యక్రమంలో జేఏసీ నాయకులు సల్మాన్, శ్రీనివాస్, రమేష్, పొచ్చన్న, ప్రీయ, మమత, అనసూయ, లక్ష్మీ ఉన్నారు.