హయ్యర్‌ పెన్షన్‌ సమస్యలపై 3న ధర్నా

– టీఎస్‌ఆర్టీసీ జేఏసీ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హయ్యర్‌ పెన్షన్‌ ఆన్‌లైన్‌ సమస్యల పరిష్కారం కోసం జులై 3వ తేదీ బర్కత్‌పురాలోని ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. బుధవారం టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆఫీస్‌లో జేఏసీ సమావేశం చైర్మెన్‌ కే రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. కన్వీనర్‌ వీఎస్‌ రావు, కో కన్వీనర్‌ కత్తుల యాదయ్య, జేఏసీ నాయకులు పీ రవీందర్‌రెడ్డి, ఎమ్‌ వెంకట్‌గౌడ్‌, ఎన్‌ మంగ, డి. గోపాల్‌ , కె.రాంరెడ్డి, బి.జకరయ్య, కె.గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే జేఏసీ కలిసి పనిచేస్తామని టీఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి లేఖ ద్వారా తెలిపారు. ఆయన తరఫు ప్రతినిధులుగా బీ యాదయ్య, ఎన్‌ కమలాకర్‌, బి.నరేందర్‌, జీపీఆర్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్మికులు తక్షణం ఎదుర్కొంటున్న ప్రధానమైన రెండు సమస్యలపై జేఏసీ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌-కేవైసీ అనుసంధానం, హయ్యర్‌ పెన్షన్‌ సమస్యలపై ధర్నా చేయాలని నిర్ణయించారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లలు, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగంలో చేరిన వారికి రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.