
పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వై పని ఆసాములకు అనుబంధ రంగా కార్మికులకు ఉపాధి కల్పించాలని ఫిబ్రవరి 7 న చేనేత జౌలి శాఖ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పవర్లూమ్ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పట్టించుకుంటలేని ఎమ్మెల్యే కేటీఆర్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళే బాధ్యత ఆయనకు లేదా అనిపవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ ప్రశ్నించారు. సీఐటీయూ కార్యాలయంలో పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికుల ఆసాముల సమావేశం సిరిమల్లె సత్యం అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు అనుబంధంగా కార్మికులకు ఆసాములకు ఉపాధి కల్పించాలని జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పవర్లూమ్ కార్మికులు ఆసాములు వార్పిన్. వై పని. అనుబంధ రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ధర్నా కార్యక్రమానికి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. గత రెండు మాసాల నుండి కార్మికులకు అనుబంధ రంగా కార్మికులకు ఆసాములకు పని లేకుండా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటుఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ చీరలు ఆర్డర్ ముగిసిన నుండి యజమానులు పాలిస్టర్ మాంద్యం ఉందని పని కల్పిస్తలేరని గత ప్రభుత్వ విధానాల వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వంపై ఆధారపడే స్థితికి కేటీఆర్ తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు గత ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ వస్త్రాలపై ఆధారపడి ప్రవేట్ మార్కెట్ మొత్తానికి వదులుకోవడం తో ప్రైవేట్ మార్కెట్ మొత్తం ఇతర ప్రాంతాలకు తరలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం రావడంతో బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇస్తారో ఇవ్వరోఅని అయోమయంలో ఉన్న యజమాన్యం.లాభాలు రాని పాలిస్టర్ వస్త్రాన్ని తయారుచేసి నష్టాలు ఎందుకు కొని తెచ్చుకోవాలని పరిశ్రమను మూసి వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి చేసిన యజమానులు ఎంతో కొంత.లాభాలు గడించి మంచిగానే ఉన్నారు బతుకమ్మ చీరలతో రాజకీయ లబ్ధి పోంది.నేతన్న ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కేటీఆర్ కూడా మంచిగానే ఉన్నారు. బలైంది మాత్రం కార్మికులు అని మండిపడ్డారుఇంత తీవ్రస్థాయిలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో బందు పడి కార్మికులు ఇబ్బందులు గురవుతుంటే కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత వహించకుండా చోద్యం చూస్తున్నారు తనకు బాధ్యత లేదన్నట్టుగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల గురించి మాట్లాడుతున్నారు కానీ తను పా తినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కారం చేయవలసిన బాధ్యత తనపై ఉందని మర్చిపోతున్నారు.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కార్మికులు మొత్తం ఉపాధి కోల్పోయే పరిస్థితి కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పని కల్పించేందుకు బతుకమ్మ చీరలతో పాటు ప్రభుత్వ రంగాలకు సంబంధించిన అన్ని వస్త్రాలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయించాలని అన్నారు ఈ సమావేశంలో ఆసాముల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సిరిసిల్ల రవి చేరాల అశోక్. వార్పిన్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఉడత రవి ఉపాధ్యక్షులు బూట్ల వెంకటేశం వైపని వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఆడెపు సంపత్ పవర్లూమ్ జిల్లా నాయకులు సబ్బనిచంద్రకాంత్. బెజిగం సురేష్ మోర తిరుపతి. అడిచర్ల రాజు రమేష్ సుధన్ లు పాల్గొన్నారు.