
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపు ధోరణిని నిరసిస్తూ డిటిఎఫ్ నిజామాబాద్ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తలపెట్టిన నిరసన కార్యక్రమం చేపట్టింది. మణిపూర్ లో మైనారిటీలైన కుకీలను నాగాలను లక్ష్యంగా చేసుకొని ఆ తెగలకు చెందిన స్త్రీలపై లైంగిక దాడులు చేస్తూ, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తూ చర్చిలను ధ్వంసం చేస్తూ, జరుగుతున్న అల్లర్లను ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని, మహిళలని నగ్నంగా ఊరేగిస్తూ లైంగిక దాడి చేసి చంపిన నిందితులను వెంటనే శిక్షించాలని, కుకీ, నాగాలను అడవుల నుంచి బయటికి తరిమేసే ప్రభుత్వ కార్పొరేట్ విధానాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రధాన మంత్రి మోడీ సమస్యాత్మక ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి, అక్కడి రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని, హత్యలు అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, 267 నిబంధన కింద సంపూర్ణ చర్చకు పార్లమెంటులో అవకాశం ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో డి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శoతన్ జిల్లా అధ్యక్షులు ఏం బాలయ్య, ప్రధాన కార్యదర్శి ఆర్. రాజన్న, రాష్ట్ర కౌన్సిలర్ హీరో జిల్లా కమిటీ సభ్యులు దాసు, పెంటన్న, మండల నాయకులు కిషన్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు యాల్ .శ్రీధర్ , సుదామ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.