భువనగిరి మండలంలోని గ్రామాలకు నిధులు కేటాయించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, సూపరిండెంట్ కి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ.. భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు లేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో దోమల బెదడా, కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. అర్హులైన వారందరికీ 150 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. నూతన రేషన్ కార్డులను, పెన్షన్ ను వెంటనే మంజూరు చేయాలని, హనుమాపురం నుండి అనంతరం వరకు బీటీ రోడ్ వేయాలని, కురుమ గూడెం నుండి మన్నె వారి పంపు వరకు బీటీ రోడ్డు వెయ్యాలని, బస్వాపురం నుండి హాన్మపురం వరకు రోడ్డు వేయాలని, నందనం, సిరివేరి కుంట మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, అనాజిపురం నుండి జంపల్లి మధ్యలో చిన్నేరు వాగు నూతన బిడ్జి నిర్మాణం చేయాలని, నమాజ్ పల్లి నుండి తుక్కరం బీటీ రోడ్డు మార్చాలని, చీమల కొండూరు నుండి ముస్తాలపల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని, ముస్తాలపల్లి నుండి మూటకొండూర్ రోడ్డు వేయాలని, బస్వాపురం నుండి గంగసాని పల్లి వరకు రోడ్డు వేయాలని, పెంచికల్పహాడ్ వెళ్లే దారిలో అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని, ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు ఉపయోగపడే బస్వాపూర్ రిజర్వాయర్ కల్వా పై బ్రిడ్జి నిర్మించాలని అన్నారు. బస్వపూర్ గ్రామంలో గతంలో కేటాయించిన ఇంటి స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణానికి రూ.10 లక్షల రూపాయలు మొదట విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, అన్నం పట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, పాండాల మైసయ్య, శాఖ కార్యదర్శిలు నరాల చంద్రయ్య, ఏదునూరు వెంకటేష్, కూకుట్ల కృష్ణ, పార్టీ నాయకులు బండి శీను, దయ్యాల మల్లేష్, బొల్లెపల్లి కిషన్, కొల్లూరు సిద్దిరాజు, కునుమ మధు లు పాల్గొన్నారు.