ముందస్తు అరెస్టులకు నిరసనగా ధర్నా  

Dharna to protest early arrestsనవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్) 
బాన్సువాడ నియోజకవర్గంలోని కొత్త బాది గ్రామానికి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాక సందర్భంగా ముందస్తు చర్యగా గ్రామాల్లో ఉన్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం బాన్సువాడ మండలం లోని కొత్త బాది గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న   స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డు కునేందుకు ప్రయత్నించిన నలుగురిని పోలీసులు ముందస్తు చర్యగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు కొందరు గతం లో మాజీ స్పీకర్ పోచారంను తిట్టే వీడియో తీసి వైరల్ చేశారు. కొత్తబాది ఆదర్శ పాఠశాలలు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనడానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాక సందర్భంగా పోలీసులు అతి ఉత్సాహం చూపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమానికి అడ్డు తగులుతారని ముందు జాగ్రత్తగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు మంగళవారం ఉదయం శావలి ఖాన్, దారావత్ గోపాల్, ధరావత్ ఆనంద్, బాబా, నానిలను  బాన్సువాడ పోలీసులు ముందస్తుగా హారతి చేశారు. అరెస్టులకు నిరసనగా రాజీవ్ గాంధీ చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ధర్నా చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకుల పై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండ భాస్కర్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మంత్రి గణేష్ పెద్ద తదితరులు పాల్గొన్నారు.