పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

Dharna should solve the problems of pensioners..నవతెలంగాణ – ఆర్మూర్ 

తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్స్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని బుధవారం ధర్నా నిర్వహించి ఆర్డీవో రాజా గౌడు కు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ముఖ్య అధ్యక్షులు సాయన్న ,అధ్యక్షులు బాబా గౌడ్ లు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల 5 డి ఎ లను వెంటనే ప్రకటించి అమలు చేయాలని, అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లకు ఆసరా పెన్షన్లు ,తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని, ప్రతి జిల్లాలో వెళ్లే సెంటర్లను ఏర్పాటు చేయాలని, బిస్వాల్ కమిషన్ రికమండు మేరకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న మాదిరిగా 20 సంవత్సరాల సర్వీస్కు ఫుల్ పెన్షన్ జూలై 1, 2018 నుంచి అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న గ్రాడ్యుటి 20 లక్షలు చెల్లించాలని, సీనియర్ సిటిజెన్లకు మిగతా రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరిగా టీజీ ఆర్టీసీ బస్ చార్జీలలో 50% రాయితీ ఇవ్వాలని, పెన్షనర్లకు కూడా తెలంగాణ ఆవిర్భావ పారితోషికం ఇవ్వాలని కోరినారు  ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ నారాయణ గౌడ్,, గంగారం తదితరులు పాల్గొన్నారు.