నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని ఐలాపురం గ్రామ రెవెన్యూ శివారులో గల 169 అసైన్డ్ భూమిలో ఆటోనగర్ కొరకు భూసేకరణను వెంటనే నిలిపివేయాలని ఐలాపురం గ్రామ రైతులు మంగళవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ నాలుగుతరాల నుండి అదే భూమిని సేద్యం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామన్నారు.ఎన్‌హెచ్-365 ఖమ్మం-సూర్యాపేట హైవే కింద కొంతభూమిని కోల్పోయామన్నారు. మిగిలిన భూమిని కూడా ప్రభుత్వం వారు తీసుకుంటే మా బతుకు అధోగతి పాలవుతుందన్నారు. ప్రభుత్వం వారు ఆటోనగర్ ఆలోచనను విరమించుకొని మా భూములకు శాశ్వతపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలనాయకులు బోడపట్ల శ్రీను,ఉప సర్పంచ్ వినోద్‌కుమార్,జానకిరాములు,సైదులు, సాయిలు, వెంకన్న, అశోక్,పెద్దనర్సయ్య,లింగయ్య, వెంకన్న,చిన్ననర్సయ్య, రత్తయ్య, భిక్షం, మదన్, శకిన్,సుధాకర్,చంటి,సైదులు,సురేష్,నవీన్,తేజ,భిక్షపతి పాల్గొన్నారు.