
మోడల్ స్కూల్ లలో ఉపాధ్యాయులను బదిలీ చేయాలని డిండి మోడల్ స్కూల్ వద్ద మంగళవారం భోజనం సమయంలో ప్లే కార్డులు పట్టుకొని ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడల్ పాఠశాలలో గత 11 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని, ఇంతవరకు బదిలీలు చేయలేదన్నారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెంటనే చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయపరమైన తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ ఎమ్ ఎస్ టి ఎఫ్ బాధ్యులు సత్యనారాయణ చిత్తలూరి, జిలానీ, రఘు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసాచారి, జయంతి, పల్లవి, అనిత, వినుత, జ్యోతి, విజయ, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.