– ఖరీప్ సీజన్ పూర్తి కావస్తున్న, అందని రైతు భరోసా
నవతెలంగాణ – భూదాన్ పోచంపల్లి
ఖరీప్ సీజన్ పూర్తి కావస్తున్న, ఇప్పటికీ, రైతు భరోసా అందక రైతులు ఎదురు చూస్తున్నారని, వెంటనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చెయ్యాలని, ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పాక వెంకటేశం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పార్టీ సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15000 రూపాయలు రైతు భరోసా కింద అందిస్తామని చెప్పి 10 నెలలు అవుతున్నా నేటికీ రైతులకు అందలేదన్నారు. ఖరీప్ (వానకాలం సీజన్) పూర్తి కావస్తున్న, ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడులకు, రైతులకు రైతు భరోసా అందించక పోవడంతో, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ, నష్ట పోతున్నారని అన్నారు. దసరా లోపు, రైతుభరోసా అందిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన, రైతు భరోసా అందక పోవడంతో, రైతులు నిరాశకు లోనవ్వడమే కాక, ప్రభుత్వంపై విశ్వాశాన్ని కోల్పోతున్నారని అన్నారు. రైతు భరోసా రైతుల ఖాతాల్లో వెంటనే జమ చెయ్యాలని డిమాండ్ చేసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా, రైతులందరికి రెండు లక్షల రుణమాఫి వర్తింప చెయ్యాలని, కాలయాపన చేయకుండా రైతు భరోసా వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసి రోజులు గడుస్తున్న కొనుగోలు చేయడం లేదని రైతులు రైస్ మిల్లల్లో చేతిలో నష్టపోతున్నారని అన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి శ్రీనివాస్ రావుల శేఖర్ రెడ్డి బత్తుల శ్రీశైలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.