– ఫైనల్‌కు రమిత
– 38వ జాతీయ క్రీడలు
డెహ్రడూన్: 38వ జాతీయ క్రీడల్లో తొలిరోజు ఒక జాతీయ రికార్డు బ్రేక్ కాగా.. కర్ణాటకకు చెందిన ధీనిధి దేశింగు మూడు స్వర్ణ పతకాలతో సత్తా చాటింది. ఇక 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో మహిళా షూటర్లు రమిత జింధాల్-తిలోత్తమ సేన్ జంట ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన 200మీ. ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో ధీనిధి(కర్ణాటక) ఒక 2నిమిషాల 03:24సెకన్లలో గమ్యానికి జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే మహిళల 100మీ. బటర్‌ఫ్లైలో ధీనిధి ఒక నిమిషం 3:62 సెకన్లలో గమ్యానికి చేరి మరో బంగారు పతకాన్ని ఖాయం చేసింది. 200మీ. ఫ్రిస్టైల్‌లో భవ్య(ఢిల్లీ) 2నిమిషాల 8:68సెకన్లు, అదితి(మహారాష్ట్ర) 2నిమిషాల 09:74 రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. ఇక 100మీ. బటర్ ఫ్లై విభాగంలో నిషా శెట్టి(కర్ణాటక) ఒక నిమిషం 4:81సెకన్లు, శ్రీసి ఉపాధ్యాయ(ఒడిషా) ఒక నిమిషం 5:20సెకన్ల రజత, కాంస్యాలను సాధించారు.
ఉషులో మణిపూర్ జట్లకు స్వర్ణం
ఇక ఉషులో మణిపూర్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో కె.లక్ష్మీదేవి, పురుషుల విభాగంలో బోనిష్ స్వర్ణ పతకాలను చేజిక్కించుకున్నారు.