న్యూయార్క్ : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాన ఆటగాడిని చూసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ జరుగుతున్న యూఎస్ ఓపెన్ విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ మ్యాచ్‌ను ఎంజారు చేశాడు. అవును.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ నిన్న యూఎప్ ఓపెన్‌లో సందడి చేశాడు. తన ఫేవరెట్ ప్లేయర్ అయిన అల్కరాజ్ గేమ్ చూసి మురిసిపోయాడు. దాంతో, ‘ఈ దిగ్గజ క్రికెటర్ అల్కరాజ్ ఫ్యాన్’ అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.
మాజీ చాంపియన్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన అల్కరాజ్ దుమ్మురేపుతున్నాడు. నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. హౌరాహౌరీ జరిగిన పోరులో 6-3, 6-2, 6-4తో జ్వెరెవ్‌ను మట్టి కరిపించి వరుసగా రెండో సారి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఫైనల్ చేరి వరుసగా రెండో టైటిల్ గెలవాలనుకుంటున్న అతడికి డానిల్ మెద్వెదేవ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురుపడనున్నాడు.