ధూం ధాం..

ధూం ధాం..చేతన్‌ కష్ణ, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిశోర్‌ మచ్చ రూపొంది స్తున్నారు. గోపీ మోహన్‌ స్టోరీ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ ఆన్‌ లొకేషన్‌లో రిలీజ్‌ చేశారు.