సెట్స్‌పైకి ధృవ్‌ కొత్త చిత్రం

సెట్స్‌పైకి ధృవ్‌ కొత్త చిత్రంతమిళ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ధవ్‌ ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ సినిమాలో హీరోకు జోడిగా దర్శనా రాజేంద్రన్‌ నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్‌ను పూర్తి చేసెయ్యాలని డైరెక్టర్‌ ప్లాన్‌ చేస్తున్నారు.