ధృవ్‌ షోరే, యశ్‌ రాథోడ్‌ సెంచరీలు

Dhruv Shorey, Yash Rathore centuries– విజయ్‌ హజారే టోర్నీ ఫైనల్‌కు విదర్భ
– సెమీస్‌లో మహారాష్ట్రపై ఘన విజయం
వడోధర: విజయ్‌ హజారే వన్డే టోర్నమెంట్‌ ఫైనల్లోకి విదర్భ జట్టు దూసుకెళ్లింది. కోటాంబి స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో విదర్భ జట్టు మహారాష్ట్రను చిత్తుచేసింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు 50ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 380పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్లు ధృవ్‌ షోరే(114), యశ్‌ రాథోడ్‌(116) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 224పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కెప్టెన్‌ కరణ్‌ నాయర్‌(88నాటౌట్‌; 44బంతుల్లో 9ఫోర్లు, 5సిక్సర్లు), జితేశ్‌ శర్మ(51; 33బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. దీంతో ఆ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేశ్‌ చౌదరికి రెండు, బఛావ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో కర్ణాటక జట్టు 5వికెట్ల తేడాతో హర్యానాను ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. శనివారం జరిగే టైటిల్‌ పోరులో కర్ణాటకతో విదర్భ జట్టు తలపడనుంది.