కొడిశల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘనంగా ధ్యానచంద్ జయంతి వేడుకలు 

నవతెలంగాణ -తాడ్వాయి :
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశల ప్రభుత్వ గిరిజన బాలురు ఉన్నత ఆశ్రమ పాఠశాలలో గురువారం హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయులు తోలెం దేవదాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తోలెం దేవదాస్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటన గుర్తు చేశారు. హాకీ క్రీడల్లో 8 స్వర్ణ పథకాలు సాధించి పెట్టారని తెలిపారు. మన దేశంలో క్రీడాకారులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్య ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ ఆఫీసర్ యాలం ఆదినారాయణ మాట్లాడుతూ దేశం మొత్తం గర్వించదగ్గ క్రీడాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అజ్మీరా రవీందర్, ఆలం జగపతిరావు, యలం ఆదినారాయణ, దేవుల, నాలి వెంకటేశ్వర్లు, దుబ్బ ధర్మరాజు, పెనక సుధాకర్, కంటెం శేషు, సోలం సాంబయ్య, జిగట భాస్కర్, నారాయణ, ఏఎన్ఎం సుధారాణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.