కుష్టు రోగుల నిర్ధారణ చేపట్టాలి..

– ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్.
నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని రాంపూర్ డి గ్రామంలో కుష్టు రోగుల నిర్ధారణ కార్యక్రమంను ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ బుధవారం పరిశీలించారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వారి శరీరంపై ఏవైనా గోధుమ రంగు మచ్చలు, చెమట లేని మచ్చలు, స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పరిశీలించి స్పర్శ పరీక్ష నిర్వహించి నిర్ధారణ కొరకు జిల్లా అధికారులకు నివేదించడం జరుగుతుందని శంకర్ వివరించారు. ఆ మచ్చలను ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా ? ఒకటి ఉన్నాయా ఒకటి కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కేసును మల్టీ బాసిల్లై కేసు కింద నమోదు చేయాలని వారికి సూచించారు . ఈ కార్యక్రమం 30 ఆగస్టు వరకు కొనసాగుతుందని తెలిపారు . గ్రామాల్లోని ఆశా కార్యకర్తలకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్. ఎల్. ఎచ్. పి. రేణుక, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.